Sainik School: సైనిక్ స్కూల్ ప్రవేశ ప‌రీక్ష ఏప్రిల్ 5! 1 y ago

featured-image

కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠ‌శాలల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎన్‌టీఏ, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ (AISSEE) - 2025 సిటీ ఇంటిమేష‌న్ స్లిప్‌ల‌ను విడుద‌ల చేసింది. విద్యార్ధులు అప్లికేష‌న్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాలు న‌మోదు చేసి వివ‌రాలు పొంద‌వచ్చు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్ధుల ఫోటో, సంత‌కం త‌ప్పుగా వ‌స్తే తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని తెలిపింది. ఈ ప‌రీక్షను ఏప్రిల్ 5న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది. దీని ద్వారా 2025-26 విద్యా సంవ‌త్సరానికి ఆరు, తొమ్మిది త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌ను క‌ల్పించ‌నున్నారు. డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD